సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్‌పై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టపర్తి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఆయన పిల్లలతో కలిసి నిద్రించారు. శనివారం ఉదయం వారితోనే యోగాసనాలు వేసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కష్టపడి చదవాలని ప్రోత్సహించారు.