TG: బీజేపీ కిరికిరి వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగిపోయాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. గవర్నర్ దగ్గర ఆ బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెట్టి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బీజేపీ మద్దతిచ్చి గవర్నర్ దగ్గర అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు.