ప్రకాశం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా శనివారం కనిగిరి పట్టణంలోని స్థానిక 20వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ పెద్దాల నారాయణ యాదవ్ హాజరయ్యారు. వైసీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.