WGL: ఉమ్మడి జిల్లాలో మద్యం షాపు టెండర్ దరఖాస్తులకు నేడు ఆఖరి తేదీ. కానీ BC JAC రాష్ట్ర బంద్ పిలుపుతో దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. బ్యాంకులు బంద్ కావడంతో టెండర్ ఫీజు DDలు తీసేందుకు అవకాశం లేదు. దీంతో మద్యం షాప్ టెండర్లకు నేడు దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అధికారులు దరఖాస్తుల గడువు పొడిగించాలని కోరారు.