భారత వన్డే క్రికెట్లో రేపటి నుంచి శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో నూతన శకం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అన్నాడు. రేపటి మ్యాచ్ జరిగే పెర్త్ పిచ్ వన్డే ఫార్మాట్‌కు చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అంతిమంగా అత్యుత్తమంగా ఆడిన జట్టు విజయం సాధిస్తుందని గిల్ పేర్కొన్నాడు.