ATP: రాయదుర్గం–కళ్యాణదుర్గం మధ్య గుండ్లపల్లి సమీపంలో వేదావతి నది పూర్తిగా ఎండిపోయింది. ఈ నది ఎండిపోవడంతో పరిసర గ్రామాల భూగర్భ జలాలు పడిపోయాయని స్థానికులు చెబుతున్నారు. వేదావతి నది కొన్ని కిలోమీటర్లు జిల్లాలో ప్రవహించిన అనంతరం కర్ణాటకకు చేరుతుంది. సిరుగుప్ప సమీపంలో తుంగభద్ర నదిలో కలుస్తుంది.