AP: ప్రభుత్వ ఉద్యోగులతో మంత్రుల భేటీ కొనసాగుతోంది. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న 4 DAలను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. వీటిని ప్రకటిస్తే ప్రభుత్వంపై రూ.340 కోట్ల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో దీపావళి కానుకగా ఒక DA మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 12వ PRC కమిషన్ ఆలస్యం కావడంతో IR కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.