నంద్యాల పట్టణానికి చెందిన రహిమాన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కోయిలకుంట్లకు వెళ్లాలని ఆటోలో బస్టాండుకు చేరుకున్నాడు. ఇదే క్రమంలో తన భార్య హ్యాండ్ బ్యాగ్ ఆటోలో మర్చిపోయింది. బ్యాగులో 8 తులాల బంగారు ఉన్నట్లు బాధితుడు లబోదిబోమన్నాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆటోను గుర్తించి బంగారం నగలను బాధితులకు ఇప్పించారు.