SKLM: అత్యవసర సమయంలో సీపీఆర్ నిర్వహించినట్లయితే ఒకరి ప్రాణాన్ని కాపాడడం జరుగుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దాడ లత తెలిపారు. శనివారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సీపీఆర్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. మాకివలస పిహెచ్సి ఎం ఎల్ హెచ్ పీ యమున ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సీపీఆర్ ఏ విధంగా చేయాలో విద్యార్థులకు స్వయంగా తెలియజేశారు.