WGL: సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో శనివారం వ్యవసాయ పనులకు వెళ్లిన శారద (46)ను నాగుపాము కాటు వేసింది. చేనులో పత్తి తీస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటిగా చేరుకున్న 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, శారదను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.