ప్రకాశం: సంతనూతలపాడులో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటించారు. మానవ మనుగడకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చదనం అవసరమని ఆయన పేర్కొన్నారు.