HYD: జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. శనివారం గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను రంగంలోకి దించింది. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని బరిలోకి దించగా, భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నాగోల్ కార్పొరేటర్ సురేంద్రనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు.