NTR: గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న సంగేపు మణికుమార్ అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరఫున ఎంపికయ్యాడు. ఈ పోటీలు పల్నాడులో జరగనున్నాయి. ఈ సందర్భంగా హైస్కూల్లో శనివారం హెచ్ఎం కిష్టఫర్, పీడీ అంజయ్య, ఉపాధ్యాయులు మణికుమార్ను అభినందనలు తెలియజేశారు