TG: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు గర్భిణీలు మృతిచెందారు. ఆసిఫాబాద్(D) గెర్రెలో గర్భిణీ అయిన తన కోడలిని ఓ వ్యక్తి నరికి చంపాడు. కొడుకు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతోనే అతను ఈ హత్య చేసినట్లు సమాచారం. అటు కామారెడ్డి(D) తిమ్మాపూర్ గ్రామంలో వరకట్న వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లల ముందే నాగరాణి(25) అనే గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.