GDWL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బీసీ జేఏసీ రాష్ట్ర బంద్కు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధులలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.