నారాయణపేట పట్టణంలోని పళ్ళ, ఎస్సీ వాడలలో కోతుల బెడద విపరీతంగా పెరిగిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలలుగా కోతులు గుంపులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి వస్తువులను పాడు చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.