KDP: మైదుకూరు మండలం పప్పనపల్లి పంచాయతీ పరిధిలోని ఓబులాపురం, పప్పనపల్లి,చేర్లొపల్లి గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి, పసుపు, అరటి పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. రైతుసేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.ప్రభుత్వం ఆదుకోకపోతే నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.