AP: మంత్రి లోకేష్ రేపు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించనున్న లోకేష్.. పలు యూనివర్సిటీల ఉన్నతాధికారులతో సమావేశమై అధునాతన విద్యావిధానాలు, నైపుణ్య శిక్షణ పద్ధతులపై ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. అలాగే అక్కడి ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానం మేరకు ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్’లో పాల్గొననున్నారు.