TG: బంద్ శాంతియుతంగా జరుగుతోందని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ‘బంద్కు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. కోర్టులు కూడా బీసీల వాదనలు వినడం లేదు. 42శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి. ఉన్నత పోస్టుల్లో అందరూ రెడ్డిలే ఉన్నారు. రిజర్వేషన్లపై రెడ్డి జాగృతే కోర్టుకెళ్లి స్టే తెచ్చింది’ అని మండిపడ్డారు.