SKLM: ఆముదాలవలస తహశీల్దార్ ఎస్.రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో భూముల రీ సర్వే ఫేజ్ -1, ఫేజ్ -2 అనే రెండు దశల్లో జరిగిందని తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-3 భూముల రీ సర్వే ప్రారంభించిందని అన్నారు. అక్కులపేట,అక్కివరం,శ్రీరామ వలస,దండేంవలస గ్రామాలలో రీ సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. సర్వే బృందానికి రైతు సహకరించాలని కోరారు.