ELR: జిల్లాలో ఇవాళ భారీగా గంజాయి పోలీసులు పట్టుకున్నారు. 59 కేసులలో సీజ్ చేసిన 3403.753 కేజీల గంజాయిని గుంటూరు జిల్లాలోని జిందాల్ సంస్థ నిర్వహించే డిస్పోజల్ చేసేందుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఇవాళ తెలిపారు. పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా వీటిని డిస్పోజల్ చేస్తున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.