కృష్ణా: సూర్య ఘర్ పథకంలో నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానం సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. శనివారం అవనిగడ్డలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్ 300వ యూనిట్ మంజూరు సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంతరాయము లేని విద్యుత్ సరఫరా కోసం ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.