TPT: గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. శనివారం తిరుపతయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రూరల్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.