ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ తీరంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోటు మునిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆ బోటు 14 మంది భారతీయులతో వెళ్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.