NLR: ఉదయగిరి MPDO ఆవరణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను శుక్రవారం పంచాయతీరాజ్ డీఈ సీహెచ్ మణికుమార్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన గుత్తేదారులను ఆదేశించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.