ఉద్యోగాల విషయంలోవైకల్య ధ్రువీకరణకు కేంద్రప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వికలాంగుల యూనిక్ డిసెబిలిటీ ఐడీ కార్డును జాతీయ పోర్టల్‌లో చెక్ చేయాలని ఆదేశించింది. అలాగే అప్లికేషన్ ప్రోగ్రామింగ్, ఇంటర్ ఫేస్‌తో ఆయా సంస్థలు అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త నియమాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.