విశాఖపట్నం: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో “క్లీన్ ఎయిర్ కార్యక్రమం” శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈఓ పి. నారాయణ మూర్తి ప్రధాన అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీకి నాంది పలికారు. వాతావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు, సిబ్బంది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం వివరించారు.