NLG: నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరగాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన కేంద్ర BJP ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు దర్నాలో పాల్గొనడం జరిగిందన్నారు.