WNP: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శనివారం బీసీ సంఘాలు, అఖిలపక్షం పిలుపుమేరకు వనపర్తి రాజీవ్ చౌక్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలపై మొండి వైఖరి విడనాడాలని, బీజేపీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందని ప్రజలు గ్రహించాలన్నారు.