WNP: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరులో నేడు వివిధ రాజకీయ పార్టీలు బంద్ నిర్వహించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, బీజేపీ నాయకులు వేర్వేరుగా ర్యాలీలు చేపట్టారు. ఈ మేరకు బంద్ ప్రభావంతో పట్టణంలోని షాపులు మూతపడ్డాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ శివకుమార్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.