PDPL: మంథని నియోజకవర్గం అంకుసాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, కాటారం మండల సింగిల్ విండో డైరెక్టర్ ఐలి రాజాబాపు బీఆర్ఎస్లో చేరారు. మంథనిలోని రాజగృహలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజాబాపును పుట్ట మధూకర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.