KRNL: జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసిన అధికారులకు, కూటమి నాయకులకు ఆదోని బీజేపీ రాష్ట్ర నాయకులు విట్టా రమేష్, కునిగిరి నీలకంఠ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి సాధించిందని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయకృష్ణ, నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.