SRPT: వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు,సిబ్బంది అందుబాటు ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ అన్నారు. శనివారం మునగాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించి, ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.