BHNG: యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో ఇవాళ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియజేయాలని కోరారు.