సత్యసాయి: జిల్లా పోలీసులు పలు చోరీ కేసులను చేధించి నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి ప్రాంతాల్లో ఇళ్ల చోరీల కేసులో రూ.12 లక్షల బంగారం, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల్లో రూ. 5.07 లక్షల అల్యూమినియం వైర్, దేవాలయ హుండీ దొంగతనాల్లో రూ. 2.16 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.