NTR: నందిగామలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. మాట్లాడుతూ.. ప్రజలకు రవాణా భద్రతపై అవగాహన కల్పించడంలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు. ఈ మేరకు ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలు, తక్కువ ఇంధన వినియోగ వాహనాలు భవిష్యత్తుకు శుభసూచకమని అన్నారు.