KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు దుష్మన్ ప్రభుత్వంగా తయారైందని, రైతుల గోడు ఏమాత్రం పట్టడం లేదని, వ్యవసాయ శాఖ నిద్రపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. కడప జిల్లాలోనే 2లక్షల ఎకరాల్లో రబీలో బుడ్డ సెనగ పంట వేస్తారు. 60 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఒక గింజ కూడా సరఫరా చేయలేదన్నారు.