WGL: నగరంలోని ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి సుందరయ్యనగర్ సమీపంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళంవేసి ఉన్న పొన్నాల రాజు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో సుమారు 4 తులాల బంగారం, రూ.2.70 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నీ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ శనివారం తెలిపారు.