TG: రైతును రాజును చేయాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ వర్షకాలం వరి పంట దిగుబడి అద్భుతంగా రాబోతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో దిగుబడి రాలేదన్నారు. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటే గొప్ప అని అన్నారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు.