CTR: 2016 నవంబరు 17న నగరపాలక కార్యాలయంలో కఠారి అనురాధ, మోహన్ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు చింటూతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసు గురువారం తొమ్మిదో అదనపు జిల్లా కోర్టులో వాయిదాకు రాగా, న్యాయమూర్తి శ్రీనివాసరావు ఈ కేసును ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.