RR: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. గత నెల 16 నుంచి 30వ తేదీ వరకు 162 మంది పోకిరిలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, బహిరంగ ప్రదేశాల్లో షీ టీమ్స్ పోలీసులు మఫ్టీలో డెకరేషన్ ఆపరేషన్ చేస్తున్నారని, పోకిరీల చేష్టలను సాక్షాధారాలతో సహా న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నారన్నారు.