KMM: తల్లి, కొడుకుల హత్య ఘటనలో నిందితుడికి జీవితఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు వెల్లడించారు. నారాయణపురంలో జరిగిన హత్య ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సత్తుపల్లి పోలీసులు సురేష్ నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నేరం అంగీకరించడంతో పై తీర్పు ఇచ్చారు.