ADB: పట్టణంలోని దస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్కూల్ బ్యాగులు, విద్య సామాగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది ఆదర్శ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం గొప్ప విషయం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు.