ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరాటే సీనియర్, జూనియర్ మాస్టర్ల సమావేశం జరిగింది. గురువారం మాజీ డిప్యూటీ మేయర్ చల్లా హరిశంకర్ కార్యాలయంలో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల మాస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, కరాటేను ప్రభుత్వ క్రీడగా గుర్తించాలని, క్రీడాకారులకు ఇళ్ల స్థలాలు, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలని మాజీ మేయర్ డిమాండ్ చేశారు.