BDK: అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామంలో నేడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తారని ఆయిల్‌పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ తెలిపారు. ఈ పర్యటనలో ఆయిల్ ఫెడ్ నర్సరీని మంత్రి సందర్శిస్తారని, ఆయిల్‌పామ్ మొక్కలకు తెగుళ్లు, అంటువ్యాధులు సోకకుండా నర్సరీలో చేపట్టే చర్యల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని తెలిపారు.