శ్రీకాకుళం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భక్తి వాతావరణం నెలకొంది. కార్తీక మాసం ప్రారంభంతో ముందే అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున భక్తులు పల్లె, పట్టణ వీధులలో “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో మారు మ్రోగిస్తున్నారు. దీక్ష ప్రారంభం సందర్భంగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు మాలలు వేసి 41 రోజల దీక్ష చేస్తారు.