GNTR: తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గురువారం రాత్రి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. తోట వారి వీధి-1 లో బడ్డీ కొట్టు నడుపుకునే మానేపల్లి శ్రీ నాగలక్ష్మి తన కుమారుడితో కలిసి షాప్ వద్ద కూర్చుని ఉన్న సమయంలో బైక్పై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ ఆగంతకుడు ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.