CTR: శ్రీనివాస మంగాపురం శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు శనివారం పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం అందజేశారు. వారి వెంట జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు పలువురు నాయకులు ఉన్నారు.