NRML: శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను మ్యాప్ ద్వారా వివరించారు. బాసర వంటి పుణ్యక్షేత్రానికి రావడం గొప్ప ఆనందంగా ఉందని స్వామీజీ పేర్కొన్నారు.