AKP: జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. శనివారం సాయంత్రం అనకాపల్లిలో షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా వస్తువుల ధరలు తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. ధరలు తగ్గడం చిన్న వ్యాపారులు వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు.